facebook


భారతదేశంలో విరేచనాలకు ఉత్తమమైన మందుల జాబితా: విరేచనాల మందులపై సమగ్ర మార్గదర్శిని

Image of best loose Motion Medicines In India Image of best loose Motion Medicines In India

విరేచనాలు అనేవి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సాధారణ సమస్యల్లో ఒకటి. ఈ సమయంలో మలం పలుచగా, నీళ్లలా వస్తుంది. కొన్ని ఆహారాలు పడకపోవడం, కలుషితమైన నీరు తాగడం, ఒత్తిడి, పరిశుభ్రత లోపించడం, అంటువ్యాధులు వంటి కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరంలో నీరు తగ్గడం, నీరసం కలగడం, రోజువారీ పనులకు ఇబ్బంది కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

భారతదేశంలో విరేచనాల నివారణకు సాధారణంగా వాడే కొన్ని మందుల్లో లోపెరమైడ్, రేసెకాడోట్రిల్, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు కలిగిన ఔషధాలు ఉన్నాయి. అయితే, సమస్యకు కారణమైన అంటువ్యాధి, పేగుల్లో సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతినడం లేదా పేగుల్లో మంట వంటి పరిస్థితులను బట్టి ఏ మందు వాడాలనేది మారుతుంది.

విరేచనాలకు సరైన మందును ఎంచుకోవడం అనేది వాటికి గల కారణం, లక్షణాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. 

ఈ వ్యాసంలో పెద్దవారికి విరేచనాల నివారణకు సాధారణంగా ఉపయోగించే మాత్రలు, ఇతర చికిత్సా పద్ధతులతో పాటు, స్వల్పంగా విరేచనాలు రావడం నుంచి అంటువ్యాధుల వల్ల కడుపు, పేగులకు ఇబ్బంది కలిగే పరిస్థితుల వరకు ఉపశమనం పొందేందుకు ఉపయోగపడే చికిత్సా మార్గాలను వివరించాం. 

విరేచనాలు అంటే ఏమిటి?

సాధారణం కంటే ఎక్కువసార్లు పలుచగా లేదా నీళ్లలా మలం రావడాన్ని విరేచనాలు అంటారు. కలుషితమైన ఆహారం లేదా నీరు తీసుకోవడం, అంటువ్యాధులు, కొన్ని ఆహారాలు పడకపోవడం, కొన్ని మందుల ప్రభావం లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇతర సమస్యల వల్ల ఇవి రావచ్చు.

విరేచనాలు రావడానికి కారణాలు 

విరేచనాలు రావడానికి సాధారణంగా ఉండే కొన్ని కారణాలు ఇవి:

  • కలుషితమైన ఆహారం లేదా నీరు తీసుకోవడం
  • బ్యాక్టీరియా లేదా వైరస్‌ల వల్ల వచ్చే అంటువ్యాధులు
  • పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం
  • కొన్ని ఆహారాలు పడకపోవడం లేదా వాటికి శరీరం అతిగా స్పందించడం
  • కడుపు లేదా పేగులకు సంబంధించిన అంటువ్యాధులు
  • ఒత్తిడి, జీర్ణవ్యవస్థ పనితీరులో మార్పులు
  • కొన్ని మందుల దుష్ప్రభావాలు

విరేచనాలు చాలాసార్లు తాత్కాలికంగా వచ్చి కొన్ని రోజుల్లో తగ్గవచ్చు. అయితే, తరచుగా లేదా తీవ్రంగా విరేచనాలు కావడం వల్ల శరీరంలో నీరు, లవణాలు తగ్గి నీరసం కలగవచ్చు. శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవడం, సరైన జాగ్రత్తలు పాటించడం వల్ల లక్షణాలను అదుపులో ఉంచి కోలుకోవడానికి తోడ్పడుతుంది.

విరేచనాల లక్షణాలు

సాధారణం కంటే ఎక్కువసార్లు, తరచుగా రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు పలుచగా లేదా నీళ్లలా మలం రావడం విరేచనాల ప్రధాన లక్షణం. వీటితో పాటు ఈ క్రింది లక్షణాలు కూడా కనిపించవచ్చు:

  • పలుచగా లేదా నీళ్లలా మలం రావడం
  • కడుపులో లేదా పొత్తికడుపులో నొప్పి
  • తరచుగా, అకస్మాత్తుగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం
  • వికారం లేదా వాంతులు
  • జ్వరం
  • కడుపు ఉబ్బరం

విరేచనాల చికిత్సకు ఉపయోగించే మందుల రకాలు

విరేచనాలకు ఉపయోగించే మాత్రలు పనిచేసే విధానాన్ని బట్టి వేర్వేరు రకాలుగా ఉంటాయి. కొన్ని పేగుల కదలికలను నెమ్మదింపజేస్తాయి, మరికొన్ని శరీరం నుంచి నీరు బయటకు పోవడాన్ని తగ్గిస్తాయి. ఇంకొన్ని పేగుల్లో ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటానికి లేదా శరీరంలో నీటి కొరత రాకుండా చూడటానికి ఉపయోగపడతాయి. సమస్యకు తగిన మందును ఎంచుకోవడం వల్ల సురక్షితంగా, మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

  • నోటి ద్వారా తీసుకునే నీరు, లవణాల ద్రావణం: విరేచనాల వల్ల శరీరం కోల్పోయిన నీరు, లవణాలను తిరిగి అందించి, నీటి కొరత ఏర్పడకుండా కాపాడుతుంది.
  • పేగుల కదలికలను తగ్గించే మందులు: పేగుల కదలికలను నెమ్మదింపజేసి, తగిన పరిస్థితుల్లో మలవిసర్జన జరిగే సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి.
  • పేగుల్లో ద్రవాల విడుదలను తగ్గించే మందులు: పేగుల్లోకి విడుదలయ్యే ద్రవాల పరిమాణాన్ని తగ్గించి, నీళ్లలా మలం రావడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
  • ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు కలిగిన ఔషధాలు: సాకరోమైసిస్ బౌలార్డీ మరియు లాక్టోబాసిల్లస్ రామ్నోసస్ వంటి సూక్ష్మజీవులు పేగుల్లో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటానికి తోడ్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా వచ్చే విరేచనాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడవచ్చు.
  • బ్యాక్టీరియా నాశక మందులు: విరేచనాలు వచ్చిన ప్రతిసారీ ఈ మందులు అవసరం ఉండదు. బ్యాక్టీరియా వల్ల అంటువ్యాధి వచ్చినట్లు అనుమానం ఉన్నప్పుడు లేదా నిర్ధారణ అయినప్పుడు, తగిన చికిత్స అవసరమైతే వైద్యుల సూచన మేరకే వీటిని వాడాలి.

విరేచనాలకు సాధారణంగా ఉపయోగించే మందులు

విరేచనాలకు ఏ మందు ఉపయోగించాలనేది సమస్యకు గల కారణం, తీవ్రత, వయస్సు, వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతుంది. 

విరేచనాల చికిత్సలో నోటి ద్వారా తీసుకునే నీరు, లవణాల ద్రావణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరం కోల్పోయిన నీరు, లవణాలను తిరిగి అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో లోపెరమైడ్ లేదా రేసెకాడోట్రిల్ వంటి మందులను కూడా ఉపయోగించవచ్చు. 

బ్యాక్టీరియా నాశక మందులతో సహా ఇతర చికిత్సలను కూడా వైద్యపరంగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. 

మందు పేరు

సాధారణ ఉపయోగం

జింక్

విరేచనాల చికిత్సలో సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది.

లోపెరమైడ్

తగిన పరిస్థితుల్లో పెద్దవారికి మలవిసర్జన జరిగే సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

రేసెకాడోట్రిల్

పేగుల్లోకి ద్రవాలు విడుదలయ్యే పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

సాకరోమైసిస్ బౌలార్డీ

తగిన సందర్భాల్లో పేగుల్లో సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటానికి తోడ్పడవచ్చు.

అజిత్రోమైసిన్

కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధులకు మాత్రమే ఉపయోగిస్తారు.

భారతదేశంలో విరేచనాలకు ఉపయోగించే ఉత్తమ మాత్రలు, గుళికల జాబితా

విరేచనాలకు తగిన మందును ఎంచుకోవడం అనేది సమస్యకు గల కారణం, లక్షణాల తీవ్రత, వయస్సు, వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతుంది. 

జీల్యాబ్ ఫార్మసీలో లభించే విరేచనాలకు ఉపయోగించే కొన్ని సాధారణ మాత్రలు, గుళికల వివరాలు కింద తెలుసుకుందాం.

లోపెరజీ 2 గుళికలు

లోపెరజీ 2 గుళికల్లో లోపెరమైడ్ అనే ఔషధ పదార్థం ఉంటుంది. ఇది పేగుల కదలికలను నెమ్మదింపజేసి పనిచేస్తుంది. దీంతో మలవిసర్జన జరిగే సంఖ్య తగ్గి, తగిన పరిస్థితుల్లో పెద్దవారికి విరేచనాల లక్షణాలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

  • కూర్పు: లోపెరమైడ్ (2 మి.గ్రా.)
  • ప్రయోజనాలు: తరచుగా పలుచగా మలం రావడాన్ని తగ్గించి, మలం గట్టిపడటానికి సహాయపడుతుంది.

రాకోట్రిల్ 100 గుళికలు

రాకోట్రిల్ 100 గుళికల్లో రేసెకాడోట్రిల్ అనే ఔషధ పదార్థం ఉంటుంది. ఇది అకస్మాత్తుగా వచ్చే విరేచనాల సమయంలో పేగుల్లోకి అధికంగా ద్రవాలు విడుదల కావడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో నీళ్లలా మలం రావడం, మలవిసర్జన జరిగే సంఖ్య, లక్షణాల తీవ్రత తగ్గవచ్చు.

  • కూర్పు: రేసెకాడోట్రిల్ (100 మి.గ్రా.)
  • ప్రయోజనాలు: నీళ్లలా మలం రావడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అకస్మాత్తుగా వచ్చే విరేచనాల సమయంలో శరీరంలో నీరు, లవణాల కొరతను భర్తీ చేసే చికిత్సతో పాటు ఉపయోగిస్తారు.

ఎంటెరోలోర్ 100 మాత్రలు

ఎంటెరోలోర్ 100 మాత్రలు విరేచనాలను అదుపులో ఉంచడంలో సహాయపడే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులతో కూడిన ఔషధం. ఇందులో లాక్టోబాసిల్లస్ స్పోరోజీన్స్ ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటానికి తోడ్పడతాయి. తద్వారా విరేచనాల లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు.

  • కూర్పు: లాక్టోబాసిల్లస్ స్పోరోజీన్స్ (10 కోట్ల బీజాంశాలు)
  • ప్రయోజనాలు: విరేచనాలు, జీర్ణక్రియలో ఇబ్బందులు ఉన్నప్పుడు పేగుల్లో సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది.

బయోటికాస్ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ గుళికలు

బయోటికాస్ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ గుళికల్లో ప్రీబయోటిక్స్, విరేచనాల నుంచి ఉపశమనం పొందేందుకు తోడ్పడే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి పేగుల్లో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. విరేచనాలు వంటి జీర్ణక్రియ సమస్యలు ఎదురైనప్పుడు పేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి తోడ్పడవచ్చు.

  • కూర్పు: లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ (0.48 బిలియన్లు) + లాక్టోబాసిల్లస్ రామ్నోసస్ (0.48 బిలియన్లు) + బిఫిడోబాక్టీరియం లాంగమ్ (0.48 బిలియన్లు) + బిఫిడోబాక్టీరియం బిఫిడమ్ (0.48 బిలియన్లు) + సాకరోమైసిస్ బౌలార్డీ (0.1 బిలియన్లు) + స్ట్రెప్టోకాకస్ థర్మోఫిలస్ (0.48 బిలియన్లు) + ఫ్రక్టో ఒలిగోశాకరైడ్ (300 మి.గ్రా.)
  • ప్రయోజనాలు: పేగుల్లో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను కాపాడటానికి తోడ్పడుతుంది. విరేచనాలు, ఇతర జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు ఉపయోగించవచ్చు.

విరేచనాల మందుల వల్ల కలిగే ప్రయోజనాలు

విరేచనాల లక్షణాలు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. విరేచనాలకు తగిన మందులు వాడటం వల్ల ఈ ప్రయోజనాలు కలగవచ్చు:

  • శరీరం కోల్పోయిన నీరు, లవణాలను తిరిగి అందించడం
  • తరచుగా పలుచగా మలం రావడాన్ని తగ్గించడం
  • పేగుల నుంచి అధికంగా ద్రవాలు బయటకు పోవడాన్ని తగ్గించడం
  • శరీరం త్వరగా కోలుకోవడానికి తోడ్పడటం
  • తగిన చికిత్స అవసరమైనప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియా సంక్రమణలు లేదా పేగుల్లో వాపుకు సంబంధించిన సమస్యలను అదుపులో ఉంచడం

విరేచనాల సమయంలో దేనికి దూరంగా ఉండాలి?

విరేచనాలకు మందులు వాడటంతో పాటు, మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు జీర్ణక్రియ సమస్యలను మరింత పెంచవచ్చు.

  • నూనె ఎక్కువగా ఉండే, కారంగా ఉండే, జీర్ణం కావడానికి భారంగా ఉండే ఆహారాలు
  • మద్యం
  • మీ లక్షణాలను మరింత పెంచే ఆహారాలు
  • శుభ్రంగా లేని లేదా శుద్ధి చేయని తాగునీరు
  • వైద్యుల సలహా లేకుండా బ్యాక్టీరియా నాశక మందులు వాడటం
  • మలంలో రక్తం కనిపించినప్పుడు లేదా అధిక జ్వరం ఉన్నప్పుడు వైద్యుల సలహా లేకుండా విరేచనాలను తగ్గించే మందులు వాడటం

విరేచనాల సమయంలో ఏ ఆహారం తీసుకోవాలో కూడా తెలుసుకోండి.

విరేచనాలు వచ్చినప్పుడు ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

శరీరంలో నీటి కొరత రాకుండా చూసుకోవడం, ప్రాథమిక చికిత్స తీసుకోవడం వల్ల సాధారణంగా విరేచనాలు తగ్గుతాయి. అయితే, కొన్ని ప్రమాద సూచనలను నిర్లక్ష్యం చేయకూడదు. కింది లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి:

  • మలంలో రక్తం కనిపించడం లేదా మలం నల్లగా రావడం
  • పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి
  • అధిక జ్వరం
  • తీవ్రమైన దాహం, తల తిరగడం లేదా మూత్రం చాలా తక్కువగా రావడం వంటి శరీరంలో నీటి కొరత లక్షణాలు
  • తరచుగా లేదా తీవ్రంగా విరేచనాలు కావడం
  • విరేచనాలు తగ్గకుండా కొనసాగడం లేదా మళ్లీ మళ్లీ రావడం
  • చిన్నపిల్లలు, వృద్ధులు లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి విరేచనాలు రావడం

ముగింపు

విరేచనాలు అనేవి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సాధారణ సమస్య. వీటి లక్షణాలను అదుపులో ఉంచడానికి, శరీరంలో నీటి కొరతతో పాటు ఇతర సమస్యలు రాకుండా నివారించడానికి తగిన చికిత్స తీసుకోవడం, సరిపడా నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

సమస్యకు గల కారణం, వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో లోపెరమైడ్, రేసెకాడోట్రిల్, సాకరోమైసిస్ బౌలార్డీ, కొన్ని రకాల లాక్టోబాసిల్లస్ వంటి ప్రయోజనకరమైన సూక్ష్మజీవులతో కూడిన ఔషధాలను ఉపయోగించవచ్చు.

జీల్యాబ్ ఫార్మసీలో భారతదేశంలో అందుబాటు ధరల్లో వివిధ రకాల మందులు లభిస్తాయి. వీటిలో విరేచనాలను తగ్గించే మందులు, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులతో కూడిన ఔషధాలు, శరీరంలో నీరు, లవణాల కొరతను భర్తీ చేసే ద్రావణాలు ఉన్నాయి.

Frequently Asked Questions (FAQs)

Q1. విరేచనాలను అదుపు చేయడానికి ఉత్తమమైన మందు ఏది?

Ans.లోపెరమైడ్, రేసెకాడోట్రిల్, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులతో కూడిన ఔషధాలు, నోటి ద్వారా తీసుకునే నీరు, లవణాల ద్రావణం వంటివి విరేచనాలను అదుపు చేయడానికి సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే, ఏ మందు వాడాలనేది విరేచనాలకు గల కారణం, వయస్సు, లక్షణాల తీవ్రత, వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతుంది.

Q2. విరేచనాల నుంచి వెంటనే ఉపశమనం పొందడానికి ఏం చేయాలి?

Ans.విరేచనాలు వెంటనే పూర్తిగా తగ్గుతాయని హామీ ఇచ్చే చికిత్స లేదు. అయితే, తరచుగా నోటి ద్వారా తీసుకునే నీరు, లవణాల ద్రావణాన్ని తాగడం, శరీరంలో నీటి కొరత రాకుండా చూసుకోవడం, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం, కారంగా ఉండే లేదా నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల ఉపశమనం పొందవచ్చు. విరేచనాలను తగ్గించడంలో సహాయపడే తగిన మందుల కోసం వైద్యుడిని సంప్రదించండి.

Q3. విరేచనాల చికిత్సకు ఓఆర్ఎస్ ఒక్కటే సరిపోతుందా?

Ans.కాదు, విరేచనాల చికిత్సకు ఓఆర్ఎస్ ఒక్కటే సరిపోకపోవచ్చు. ఇది శరీరం కోల్పోయిన నీరు, లవణాలను తిరిగి అందించి, నీటి కొరత ఏర్పడకుండా కాపాడుతుంది. అయితే, విరేచనాలు రావడానికి గల అసలు కారణాన్ని ఓఆర్ఎస్ చికిత్స చేయదు.

Q4. విరేచనాలను సహజంగా ఎలా తగ్గించుకోవచ్చు?

Ans.శరీరంలో నీటి కొరత రాకుండా చూసుకోవడం, ఓఆర్ఎస్ తాగడం, అరటిపండ్లు, అన్నం, ఆపిల్ గుజ్జు, రొట్టె వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం, నూనె ఎక్కువగా ఉండే ఆహారం, కారంగా ఉండే పదార్థాలు, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు దూరంగా ఉండటం వంటి అలవాట్లు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.

Q5. విరేచనాలు వచ్చినప్పుడు ఏ ఆహారాలు తీసుకోవాలి?

Ans.విరేచనాలు వచ్చినప్పుడు అన్నం, అరటిపండ్లు, కాల్చిన రొట్టె, మెత్తగా ఉడికించిన అన్నం, పెసరపప్పుతో చేసిన కిచిడీ, పెరుగు, ఉడికించిన బంగాళాదుంపలు వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. కారంగా ఉండే, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.

Q6. విరేచనాలకు ఉపయోగించే మందులు తీసుకోవడానికి వైద్యుడి చీటీ అవసరమా?

Ans.విరేచనాలకు ఉపయోగించే అన్ని మందులకూ వైద్యుడి చీటీ అవసరం లేదు. వైద్యుడి చీటీ లేకుండా లభించే కొన్ని మందులు కూడా విరేచనాల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, సరైన మందును ఎంచుకోవడానికి వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

Q7. పిల్లలకు విరేచనాల కోసం సిరప్ ఇవ్వవచ్చా?

Ans.విరేచనాలు వచ్చినప్పుడు పిల్లలకు ఓఆర్ఎస్, జింక్ సిరప్ అవసరం కావచ్చు. అయితే, ఇతర ద్రవరూప మందులను పిల్లల వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఇవ్వాలి.

Q8. విరేచనాలను తగ్గించడంలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు సహాయపడతాయా?

Ans.ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు పేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, కొంతమందిలో విరేచనాల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడవచ్చు. అయితే, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు విరేచనాలకు గల కారణం, వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతాయి.

Q9. గర్భధారణ సమయంలో విరేచనాలు తగ్గడానికి ఏ మందు తీసుకోవచ్చు?

Ans.శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా నివారించడానికి ఓఆర్ఎస్ తీసుకోవడం సాధారణంగా ముఖ్యం. అయితే, గర్భిణీలు విరేచనాల కోసం ఏదైనా మందు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

Q10. చికిత్స తీసుకుంటే సాధారణంగా విరేచనాలు తగ్గడానికి ఎంత సమయం పడుతుంది?

Ans.శరీరంలో నీటి కొరత రాకుండా చూసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాధారణంగా అకస్మాత్తుగా వచ్చే విరేచనాలు కొన్ని రోజుల్లో తగ్గుతాయి. అయితే, విరేచనాలు తగ్గడానికి పట్టే సమయం వాటికి గల అసలు కారణంపై ఆధారపడి ఉంటుంది.

Q11. విరేచనాలు తగ్గకుండా కొనసాగితే ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

Ans.నీళ్లలా విరేచనాలు తగ్గకుండా కొనసాగినా, తీవ్రత పెరిగినా, మలంలో రక్తం కనిపించినా, అధిక జ్వరం వచ్చినా, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి కలిగినా, పదేపదే వాంతులు వచ్చినా లేదా శరీరంలో నీటి కొరత లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Recent Blogs


Disclaimer : Zeelab Pharmacy provides health information for knowledge only. Do not self-medicate. Always consult a qualified doctor before starting, stopping, or changing any medicine or treatment.


medicine cart

₹ 0

0

Items added


2026 Copyright By © Zeelab Pharmacy Private Limited. All Rights Reserved

Our Payment Partners

card
correct iconAdded!