facebook


భారతదేశంలో నరాల నొప్పికి ఉత్తమ మందు: నరాల నొప్పి మందుల పేర్లు, కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

Best Medicine for Nerve Pain in India Best Medicine for Nerve Pain in India

నరాల నొప్పి అనేది సాధారణ కండరాలు లేదా కీళ్ల నొప్పుల కంటే భిన్నంగా ఉంటుంది. నరాలు దెబ్బతిన్నప్పుడు, చికాకుకు గురైనప్పుడు లేదా సరిగ్గా పనిచేయనప్పుడు ఈ నొప్పి వస్తుంది. మంటగా అనిపించడం, తిమ్మిర్లు రావడం, స్పర్శ తెలియకపోవడం, అకస్మాత్తుగా సూదులతో గుచ్చినట్లుగా నొప్పి రావడం లేదా విద్యుత్‌ షాక్‌ తగిలినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ రకమైన నొప్పిని నరాల సంబంధిత నొప్పి అని కూడా అంటారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7% నుంచి 10% మంది ఈ రకమైన నరాల నొప్పితో బాధపడుతున్నట్లు అంచనా. మధుమేహం, క్యాన్సర్‌, నాగుపాము చుట్టు వ్యాధి, నరాలపై ఒత్తిడి పడటం, శారీరక గాయాలు లేదా విటమిన్‌ బి12 లోపం వంటి సమస్యలు ఉన్నవారిలో నరాల నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొన్ని రకాల నరాల నొప్పిని తగ్గించడానికి వైద్యులు సాధారణంగా గ్యాబాపెంటిన్‌, ప్రీగాబాలిన్‌, డులోక్సెటిన్‌ వంటి మందులను సూచిస్తారు.

ఈ వ్యాసం ద్వారా నరాల నొప్పికి గల కారణాలు, లక్షణాలు, నొప్పిని తగ్గించే మందులు, సాధారణంగా వాడే మాత్రల పేర్లు, చికిత్సా విధానాలు, దుష్ప్రభావాలు మరియు భారతదేశంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవచ్చు.

నరాల నొప్పి అంటే ఏమిటి?

నరాల నొప్పిని నరాల సంబంధిత నొప్పి అని కూడా అంటారు. నరాలు దెబ్బతిన్నప్పుడు, చికాకుకు గురైనప్పుడు లేదా సరిగ్గా పనిచేయనప్పుడు ఈ నొప్పి కలుగుతుంది. 

సాధారణ సంకేతాలను పంపాల్సిన నరాలు అసాధారణమైన నొప్పి సంకేతాలను మెదడుకు పంపవచ్చు. దీనివల్ల మంటగా అనిపించడం, తిమ్మిర్లు రావడం, స్పర్శ తెలియకపోవడం, అకస్మాత్తుగా సూదులతో గుచ్చినట్లుగా నొప్పి రావడం లేదా విద్యుత్‌ షాక్‌ తగిలినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

సరైన నరాల నొప్పి నివారణ మందు ఎంపిక అనేది నొప్పికి కారణమైన సమస్య మరియు దాని తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. 

నరాల నొప్పికి కారణాలు ఏమిటి?

నరాల నొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అసలు సమస్యను గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే నరాల నొప్పికి ఇచ్చే చికిత్స, మందులు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండవచ్చు.

నరాల సంబంధిత నొప్పికి సాధారణ కారణాలు ఇవి:

  • మధుమేహం
  • సయాటికా లేదా మణికట్టు వద్ద నరంపై ఒత్తిడి పడే సమస్యలు
  • శారీరక గాయాలు
  • విటమిన్‌ బి12 లోపం
  • నాగుపాము చుట్టు వ్యాధి
  • కొన్ని మందుల వాడకం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు

నరాల నొప్పి సాధారణ లక్షణాలు

నరాల నొప్పి సాధారణ కీళ్ల లేదా కండరాల నొప్పికి భిన్నంగా అనిపించవచ్చు. ఏ నరాలు ప్రభావితమయ్యాయి, నొప్పికి కారణం ఏమిటి అనే అంశాలను బట్టి లక్షణాలు మారుతాయి.

నరాల నొప్పి మరియు నరాల దెబ్బతినడం వల్ల కనిపించే సాధారణ లక్షణాలు ఇవి:

  • మంటగా లేదా అకస్మాత్తుగా గుచ్చినట్లుగా నొప్పి రావడం
  • తిమ్మిర్లు రావడం లేదా సూదులతో గుచ్చినట్లుగా అనిపించడం
  • స్పర్శ తెలియకపోవడం లేదా స్పర్శను తక్కువగా గుర్తించడం
  • విద్యుత్‌ షాక్‌ తగిలినట్లుగా నొప్పి రావడం
  • తాకినప్పుడు సాధారణం కంటే ఎక్కువ నొప్పి లేదా సున్నితత్వం కలగడం
  • ప్రభావితమైన భాగంలో కండరాలు బలహీనపడటం
  • రాత్రివేళ నొప్పి ఎక్కువ కావడం

నరాల నొప్పికి సాధారణంగా ఉపయోగించే మందులు

నరాల నొప్పిని తగ్గించడానికి పలు మందులు ఉపయోగపడవచ్చు. నొప్పికి కారణం, అది ఉన్న ప్రదేశం, తీవ్రత, మీ ఆరోగ్య పరిస్థితి, మీరు ఇప్పటికే వాడుతున్న ఇతర మందులను పరిగణనలోకి తీసుకుని వైద్యులు తగిన మందును సూచిస్తారు.

మందు పేరు

సాధారణ ఉపయోగం

ప్రీగాబాలిన్‌

నరాల సంబంధిత నొప్పిలోని పలు రకాల సమస్యలకు ఉపయోగిస్తారు.

గ్యాబాపెంటిన్‌

నరాల నొప్పికి సంబంధించిన కొన్ని సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

డులోక్సెటిన్‌

మధుమేహం వల్ల వచ్చే నరాల నొప్పితో సహా కొన్ని రకాల నరాల సంబంధిత నొప్పులకు వైద్యులు సూచించవచ్చు.

అమిట్రిప్టిలిన్‌

నిరాశకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఈ మందును కొన్ని రకాల నరాల నొప్పి తగ్గించడానికి కూడా వాడుతారు.

క్యాప్సైసిన్‌ క్రీమ్‌

శరీరంలోని ఒక నిర్దిష్ట భాగంలో ఉండే నరాల సంబంధిత నొప్పికి దీనిని పరిగణించవచ్చు.

భారతదేశంలో నరాల నొప్పికి ఉపయోగించే ఉత్తమ మాత్రల జాబితా

జీల్యాబ్ ఫార్మసీలో నరాల నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడే నాణ్యమైన, అందుబాటు ధరలలో లభించే నరాల నొప్పి మాత్రలు మరియు గుళికలు లభిస్తాయి. వైద్యులు సూచించిన విధంగా వాడినప్పుడు, మంటగా అనిపించడం, తిమ్మిర్లు రావడం, స్పర్శ తెలియకపోవడం, విద్యుత్‌ షాక్‌ తగిలినట్లుగా నొప్పి రావడం వంటి ఇబ్బందులను తగ్గించడంలో ఇవి సహాయపడవచ్చు.

గబాటిక్స్‌ 100 మాత్ర

గబాటిక్స్‌ 100 అనేది నరాల నొప్పికి ఉపయోగించే సాధారణ మాత్రలలో ఒకటి. ఇందులో 100 మి.గ్రా. గ్యాబాపెంటిన్‌ ఉంటుంది. ఇది నరాల నుంచి మెదడుకు వెళ్లే అసాధారణ నొప్పి సంకేతాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

  • కూర్పు: గ్యాబాపెంటిన్‌ 100 మి.గ్రా.
  • ప్రయోజనాలు: కొన్ని రకాల నరాల నొప్పిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు.

మై12 జి మాత్ర

మై12 జి మాత్రలో నరాల ఆరోగ్యానికి తోడ్పడే రెండు పదార్థాలు ఉంటాయి. అవి గ్యాబాపెంటిన్‌ మరియు మిథైల్‌కోబాలమిన్‌. నరాల సంబంధిత నొప్పి ఉన్నప్పుడు నరాల నుంచి వెళ్లే సంకేతాలను నియంత్రించడంలో ఈ మాత్ర సహాయపడుతుంది.

  • కూర్పు: గ్యాబాపెంటిన్‌ 300 మి.గ్రా. + మెకోబాలమిన్‌ 500 మైక్రోగ్రాములు
  • ప్రయోజనాలు: నరాల సంబంధిత నొప్పి మరియు నరాలకు సంబంధించిన లక్షణాలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు.

డుడు 30 గుళిక

డుడు 30 గుళికలో డులోక్సెటిన్‌ ఉంటుంది. ఇది మెదడులోని సెరోటోనిన్‌, నోరెపినెఫ్రిన్‌ అనే రసాయనాల స్థాయులపై పనిచేసి, కొన్ని రకాల నరాల నొప్పుల్లో నొప్పి సంకేతాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

  • కూర్పు: డులోక్సెటిన్‌ 30 మి.గ్రా.
  • ప్రయోజనాలు: మధుమేహం వల్ల కలిగే నరాల నొప్పితో సహా కొన్ని రకాల నరాల సంబంధిత నొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు.

కామ్‌జీ 25 మాత్ర

కామ్‌జీ 25 మాత్రలో అమిట్రిప్టిలిన్‌ ఉంటుంది. ఇది నరాల నొప్పి నివారణకు ఉపయోగించే మందులలో ఒకటి. మెదడులోని రసాయనాలు మరియు నొప్పి సంకేతాలపై పనిచేయడం ద్వారా కొన్ని రకాల నరాల సంబంధిత నొప్పులను నియంత్రించడంలో సహాయపడుతుంది.

  • కూర్పు: అమిట్రిప్టిలిన్‌ 25 మి.గ్రా.
  • ప్రయోజనాలు: కొన్ని రకాల నరాల నొప్పిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు.

నరాల నొప్పి మందుల దుష్ప్రభావాలు

మందులు ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా ప్రభావం చూపవచ్చు. నరాల నొప్పికి ఉపయోగించే మందుల వల్ల కొన్నిసార్లు అవాంఛిత దుష్ప్రభావాలు కలగవచ్చు. ఏ మందు వాడుతున్నారు, దాని మోతాదు ఎంత, వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలను బట్టి దుష్ప్రభావాలు మారవచ్చు.

నరాల నొప్పి మందుల వల్ల కలగవచ్చే దుష్ప్రభావాలు ఇవి:

  • తల తిరగడం లేదా మగతగా ఉండటం
  • వికారం కలగడం
  • నోరు ఎండిపోవడం
  • తలనొప్పి
  • మలబద్ధకం
  • కొన్ని సందర్భాల్లో శరీర భాగాల్లో వాపు రావడం
  • ఆకలి లేదా శరీర బరువులో మార్పులు రావడం

నరాల నొప్పి మందులు వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నరాల నొప్పి తగ్గించడానికి ఉపయోగించే మాత్రలను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనలు పాటించకుండా ఈ మందులను వాడితే తీవ్రమైన దుష్ప్రభావాలు కలగవచ్చు.

ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి:

  • వైద్యుల చీటీతో మాత్రమే వాడాల్సిన నరాల నొప్పి మందులను సొంతంగా వాడకండి.
  • వైద్యులు సూచించిన మోతాదులో, నిర్ణయించిన సమయానికి మందులను తీసుకోండి.
  • మీరు ప్రస్తుతం వాడుతున్న ఇతర మందులు, పోషక పదార్థాల మాత్రలు, మూత్రపిండాలు లేదా కాలేయానికి సంబంధించిన సమస్యల గురించి వైద్యులకు తెలియజేయండి.
  • మద్యం వల్ల మగత లేదా ఇతర దుష్ప్రభావాలు పెరిగే అవకాశం ఉంటే దానికి దూరంగా ఉండండి.
  • కొన్ని మందులను వైద్యుల సలహా లేకుండా అకస్మాత్తుగా ఆపకండి.
  • గర్భిణులు లేదా బిడ్డకు పాలిచ్చే తల్లులు నరాల నొప్పి మందులు వాడే ముందు వైద్యులను సంప్రదించాలి.

నరాల నొప్పి రాకుండా ఎలా నివారించుకోవాలి?

అన్ని రకాల నరాల నొప్పులను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను సరిగ్గా నియంత్రించుకోవడం ద్వారా నరాలు దెబ్బతినే ప్రమాదాన్ని, వాటికి సంబంధించిన లక్షణాలను తగ్గించుకోవచ్చు.

  • మీకు మధుమేహం ఉంటే, రక్తంలో చక్కెర స్థాయులను తగిన పరిధిలో ఉంచుకోండి.
  • అవసరమైన విటమిన్లు, పోషకాలు అందించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.
  • మీ ఆరోగ్య పరిస్థితికి తగిన విధంగా శారీరక శ్రమ చేయండి.
  • మద్యానికి దూరంగా ఉండండి, ఆరోగ్యకరమైన శరీర బరువును కాపాడుకోండి.
  • గాయాలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు వీలైనంత త్వరగా చికిత్స తీసుకోండి.
  • తిమ్మిర్లు రావడం, స్పర్శ తెలియకపోవడం లేదా మంటగా అనిపించడం నిరంతరంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.

నరాల నొప్పి ఉన్నప్పుడు ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? 

కారణం తెలియని నరాల నొప్పి, క్రమంగా పెరుగుతున్న నొప్పి లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగించే నొప్పి ఉంటే వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి.

కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందండి:

  • అకస్మాత్తుగా లేదా తీవ్రంగా కండరాలు బలహీనపడటం
  • స్పర్శ తెలియకపోవడం క్రమంగా పెరగడం
  • నడవడంలో లేదా శరీర సమతుల్యతను కాపాడుకోవడంలో ఇబ్బంది కలగడం
  • గాయం తర్వాత తీవ్రమైన నొప్పి రావడం
  • మూత్రం లేదా మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం
  • నరాలకు సంబంధించిన లక్షణాలతో పాటు ఇతర తీవ్రమైన లేదా వేగంగా పెరుగుతున్న లక్షణాలు కనిపించడం

ముగింపు

నరాల నొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కారణాన్ని బట్టి చికిత్స కూడా మారుతుంది. సమస్యను సకాలంలో గుర్తించడం, వైద్యుల సరైన సలహా తీసుకోవడం, తగిన నరాల నొప్పి నివారణ మందు వాడటం ద్వారా లక్షణాలను నియంత్రించుకోవచ్చు. దీనివల్ల రోజువారీ పనులు చేసుకోవడం సులభమవడంతో పాటు జీవన నాణ్యత కూడా మెరుగుపడవచ్చు.

లక్షణాలు మరింత తీవ్రం కాకుండా ఉండాలంటే నరాల నొప్పికి కారణమైన ఆరోగ్య సమస్యను సరిగ్గా నియంత్రించుకోవడం ముఖ్యం. 

నరాల నొప్పి నిరంతరంగా ఉండటం, పెరగడం, తిమ్మిర్లు రావడం, స్పర్శ తెలియకపోవడం లేదా కండరాలు బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తే తగిన పరీక్షలు మరియు చికిత్స కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Frequently Asked Questions (FAQs)

Q1. నరాల నొప్పి తగ్గడానికి ఏ మందు ఉత్తమమైనది?

Ans.గ్యాబాపెంటిన్‌, ప్రీగాబాలిన్‌, డులోక్సెటిన్‌ వంటి మందులను కొన్ని రకాల నరాల నొప్పి తగ్గించడానికి వైద్యులు సాధారణంగా సూచిస్తారు. సరైన మందు ఎంపిక అనేది నొప్పికి గల కారణం, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

Q2. నాకు నరాల నొప్పి ఉందని ఎలా తెలుసుకోవాలి?

Ans.నరాల నొప్పి ఉన్నప్పుడు మంటగా అనిపించడం, తిమ్మిర్లు రావడం, స్పర్శ తెలియకపోవడం, అకస్మాత్తుగా గుచ్చినట్లుగా నొప్పి రావడం, విద్యుత్‌ షాక్‌ తగిలినట్లుగా అనిపించడం లేదా ప్రభావితమైన భాగంలో తాకిడికి అసాధారణంగా సున్నితంగా ఉండటం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

Q3. నరాల నొప్పికి ప్రీగాబాలిన్‌ ఉపయోగపడుతుందా?

Ans.అవును, కొన్ని రకాల నరాల నొప్పికి వైద్యులు ప్రీగాబాలిన్‌ను సాధారణంగా సూచిస్తారు. ఇది నరాల్లోని అసాధారణ సంకేతాలను తగ్గించడంలో సహాయపడి, మంటగా అనిపించడం, తిమ్మిర్లు రావడం, గుచ్చినట్లుగా నొప్పి కలగడం వంటి లక్షణాలను తగ్గించవచ్చు.

Q4. నరాల నొప్పికి గ్యాబాపెంటిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందా?

Ans.అవును, కొన్ని రకాల నరాల నొప్పిని నియంత్రించడంలో గ్యాబాపెంటిన్‌ సహాయపడుతుంది. ఇది నరాల్లోని అసాధారణ సంకేతాలను తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. వైద్యులు సూచించిన విధంగానే ఈ మందును వాడాలి.

Q5. విటమిన్‌ బి12 లోపం వల్ల నరాల నొప్పి వస్తుందా?

Ans.అవును, విటమిన్‌ బి12 లోపం నరాల పనితీరును ప్రభావితం చేసి, తిమ్మిర్లు రావడం, స్పర్శ తెలియకపోవడం, కండరాలు బలహీనపడటం, నరాల సంబంధిత నొప్పి వంటి లక్షణాలకు కారణం కావచ్చు.

Q6. నరాల నొప్పి తగ్గడానికి ఎంత సమయం పడుతుంది?

Ans.నరాల నొప్పి తగ్గడానికి కొన్ని వారాలు పట్టవచ్చు లేదా అంతకంటే ఎక్కువ సమయం అవసరం కావచ్చు. ఇది నొప్పికి గల కారణం, తీవ్రత, తీసుకుంటున్న చికిత్స, అంతర్లీన ఆరోగ్య సమస్య ఎంతవరకు నియంత్రణలో ఉందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Q7. నరాల నొప్పి మాత్రల వల్ల సాధారణంగా ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి?

Ans.వాడే మందును బట్టి తల తిరగడం, మగతగా ఉండటం, వికారం, నోరు ఎండిపోవడం, తలనొప్పి, మలబద్ధకం లేదా శరీరంలోని కొన్ని భాగాల్లో వాపు వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు.

Q8. నరాల నొప్పి తగ్గించే మందులను వాడటం వల్ల అలవాటు పడే ప్రమాదం ఉందా?

Ans.కొన్ని నరాల నొప్పి మందులను దుర్వినియోగం చేయడం వల్ల లేదా దీర్ఘకాలం వాడటం వల్ల వాటిపై ఆధారపడే ప్రమాదం ఉండవచ్చు. ముఖ్యంగా ప్రీగాబాలిన్‌ వంటి కొన్ని మందులను జాగ్రత్తగా వాడాలి. వైద్యులు సూచించిన విధంగానే మందులను వాడండి. సొంతంగా మందులు తీసుకోవద్దు.

Q9. వైద్యుల చీటీ లేకుండా నరాల నొప్పి తగ్గించే మాత్రలు వాడవచ్చా?

Ans.నరాల నొప్పికి ఉపయోగించే చాలా ప్రభావవంతమైన మాత్రలను వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. నొప్పికి గల కారణాన్ని బట్టి సరైన మందు, మోతాదు మారుతాయి కాబట్టి సొంతంగా మందులు వాడకండి.

Q10. నరాల నొప్పి ఎప్పుడు తీవ్రమైన సమస్యగా పరిగణించాలి?

Ans.నరాల నొప్పితో పాటు తీవ్రమైన కండరాల బలహీనత, క్రమంగా పెరుగుతున్న స్పర్శలేమి, నడవడంలో ఇబ్బంది లేదా మూత్రం, మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి.

Recent Blogs


Disclaimer : Zeelab Pharmacy provides health information for knowledge only. Do not self-medicate. Always consult a qualified doctor before starting, stopping, or changing any medicine or treatment.


medicine cart

₹ 0

0

Items added


2026 Copyright By © Zeelab Pharmacy Private Limited. All Rights Reserved

Our Payment Partners

card
correct iconAdded!